
Adilabad | బాధితుడికి ఆర్థిక సాయం
Adilabad | బాధితుడికి ఆర్థిక సాయం
Adilabad | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణంలోని బోయవాడకి చెందిన పాకాల రాజేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడి నిజామాబాద్ ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారు. వారి హాస్పిటల్ లో చికిత్స నిమ్మితం ఉట్నూర్ హెడ్ స్వచ్ఛంద సంస్థ తరపున రూ.15వేలను హెడ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్, డాక్టర్ శ్రీనాథ్ జాదవ్ బుధవారం ఆర్థిక సహాయం అందించారు. మానవతా దృక్పథంతో ఆపదలో ఉన్న వారికి తమ హెడ్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ద్వారా సహాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. సహాయం చేసిన సొసైటీ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ సభ్యులకు బాధితుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ సభ్యులు తన్నీరు సతీష్,వేణు, బాల కృష్ణా, మోహన్ పాల్గొన్నారు.
