MDK | వీరభద్ర స్వామిని దర్శించుకున్న అడిషనల్ డైరెక్టర్ సంతోష్ కుమార్

మెద‌క్ : అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సంతోష్ కుమార్ (Dr. Santosh Kumar) బొంతపల్లి వీరన్నగూడెంలోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి (Veerabhadra Swamy) ని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శశిధర్ గుప్తా, తహసీల్దార్ పరమేష్, ఆలయ చైర్మెన్ మద్ది ప్రతాప్ రెడ్డి, పాలక మండలి సభ్యులు, పర్యవేక్షకులు సోమయ్య, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply