Actor Shivaji | నాపై కుట్ర జరుగుతోంది…

Actor Shivaji | నాపై కుట్ర జరుగుతోంది…
Actor Shivaji | హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఇటీవల జరిగిన ఓ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నటుడు శివాజీ (Actor Shivaji).. ‘హీరోయిన్ల వస్త్రధారణ’పై చేసిన కామెంట్స్ ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్(Telangana Commission for Women) సీరియస్‌గా స్పందించి.. ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఇవాళ శివాజీ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఇకపై మహిళల విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలని నటుడు శివాజీకి తెలంగాణ మహిళా కమిషన్ (Telangana Commission for Women) సూచించింది. శివాజీ మాట్లాడుతూ… తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఇకపై మహిళల విషయంలో చులకనగా మాట్లాడబోనని తెలిపారు. ఇండస్ట్రీలో కొంతమందికి నాపై వ్యతిరేకత ఉందన్నారు. ఇప్పుడది చాలా క్లియర్‌గా అర్థమవుతోందన్నారు. అందుకే నాపై కుట్ర చేశారని శివాజీ ఆరోపించారు. జూమ్ మీటింగ్ పెట్టుకుని మరీ నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన చెందారు.
ఆవేశంలో నేను మాట్లాడిన రెండు మాటలను తీసుకుని నాపై కుట్ర చేశారు. తండ్రి పాత్రలు చేస్తున్నాను కాబట్టి బిడ్డలకు చెప్పినట్లు చెప్పా. ఇందులో తప్పుడు ఉద్దేశం ఏమీ లేదు. ఏదేమైనా రెండు మిస్టేక్స్ (Two mistakes) జరిగాయి. ఇప్పటికే సారీ కూడా చెప్పాను. దయచేసి దీనిని ఇంతటితో ఆపేయండి అని మహిళా కమిషన్ ఎదుట శివాజీ వాపోయారు.
