కర్నూలు బ్యూరో, జులై 3, ఆంధ్రప్రభ : బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ (Vikrant Patil) హెచ్చరించారు. గత 5 నెలల్లో ఓపెన్ డ్రింకింగ్ పై 8,140 కేసులు (8,140 cases) నమోదైనట్లు ఆయన ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు ఎవరైనా అసౌకర్యం కల్గిస్తే చర్యలుంటాయని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గురువారం తెలిపారు.
బహిరంగంగా మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని, రోడ్లు, నడకదారులు, పార్కులు, వ్యాపార దుకాణ సముదాయాలు, శివారు ప్రాంతాలు, వల్నరబుల్ ఏరియాల్లో ప్రజాజీవనానికి ఆటంకం కలిగించే వారిపై పబ్లిక్ న్యూసెన్స్ (Public Nuisance) కింద పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గత 5 నెలలలో ( ఫిబ్రవరి – 1,976, మార్చి – 1,041, ఏప్రిల్ – 1,926, మే – 1,435, జూన్ -1,762 కేసులు ) బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజా శాంతికి భంగం కలిగించిన వారిపై మొత్తం 8,140 కేసులు నమోదు చేశారని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.