ప్రయాణికులకు షాక్!

ప్రయాణికులకు షాక్!

బస్సులోనే ‘మార్నింగ్ రోటీన్’ పూర్తి
బస్సు ప్రయాణంలోనే బ్రష్ చేసుకున్న మహిళ

అచ్చంపేట, ఆంధ్రప్రభ : ఉదయం బస్సులో ప్రయాణిస్తుంటే కొందరు మొబైల్‌లో లీనమవుతారు, మరికొందరు కునుకు తీస్తారు. కానీ ఓ మహిళ మాత్రం తన ఉదయపు కార్యక్రమాన్ని అక్కడికక్కడే పూర్తి చేసి ప్రయాణికులను ఆశ్చర్యపరిచింది. బస్సులోనే బ్రష్, టూత్‌పేస్ట్ తీసుకుని పళ్లు తోముకోవడం మొదలుపెట్టింది. నాగర్‌కర్నూలు జిల్లా పదర మండలం మద్దిమడుగు వైపు నుంచి అచ్చంపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఈ వినూత్న ఘటన చోటుచేసుకుంది. బస్సు ప్రయాణం చేస్తుండగానే మహిళ ప్రశాంతంగా పళ్లు తోముకుంటుండగా, పక్కనే కూర్చున్న ప్రయాణికులు ఒకరినొకరు చూసుకుంటూ ‘ఇది కూడా కొత్త ట్రెండేనా!’ అన్నట్టుగా ఆశ్చర్యపోయారు. కొంతమంది ప్రయాణికులు ఈ దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం కాస్త వైరల్ అయ్యింది. “ఇక నుంచి బస్సుల్లో బ్రష్ స్టాండ్, నీళ్ల బాటిల్ కూడా అవసరమేనా ఏమో!” అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply