Achampeta | ఇద్దరు మహిళా పట్టభద్రుల మధ్య రసవత్తర పోటీ

Achampeta | అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూలు జిల్లా, అచ్చంపేట నియోజకవర్గం, బల్మూరు మండలం, పోలిశెట్టి పల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థికి ప్రభుత్వం ఎస్సీ మహిళలకు కేటాయించడంతో ఇద్దరు మహిళ పట్టభద్రుల మధ్య పోటాపోటీగా రసవత్తర పోటీ నెలకొంది. మూడవ విడతలో ఈ నెల 17న జరగనున్న పోలింగ్లో మహిళా అభ్యర్థులు పోటాపోటీ ప్రచార నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గంటల ప్రియాంక సురేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధకుడు తన ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ కాంగ్రెస్ మెడ వంచి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ సారధ్యంలో గ్రామ అభివృద్ధి సాధ్యమని తమ మద్దతు దారులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు.

గ్రామ అభివృద్ధి అధికార టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని గ్రామంలో అండర్ డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు, పేదలకు ఉచిత విద్యా, వైద్యం, అందిస్తానని, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని, టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గంటల ప్రియాంక సురేష్ తమ కత్తెర గుర్తుపై ఓటు వేయాలని ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా.. గ్రామంలో చతుర్ముఖ పోటీ నెలకొంది. వీరు ఇరువురు కాక బీజేపీ బలపరిచిన అభ్యర్థి, మరొకరు స్వతంత్ర అభ్యర్థి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కి ఉంగరం గుర్తు, టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి కత్తెర గుర్తును ఎన్నికల అధికారులు కేటాయించారు. తమ కేటాయించిన గుర్తులను చూపిస్తూ అభ్యర్థులు ప్రజల మధ్య ముమ్మర ప్రచారం చేస్తున్నారు.

Leave a Reply