Achampet l ఉమామహేశ్వర క్షేత్రంలో ఉచిత వైద్య శిబిరం..

Achampet l ఉమామహేశ్వర క్షేత్రంలో ఉచిత వైద్య శిబిరం..

ఈనెల 16 వరకు అందుబాటులో వైద్య శిబిరం
పాదయాత్రగా వెళ్తున్న శివస్వాములు వైద్య సేవలను వినియోగించుకోవాలి

Achampet l అచ్చంపేట, ఆంధ్రప్రభ; మహాశివరాత్రి సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి కాలినడకన శ్రీశైలం వెళ్తున్న శివ దీక్ష చేపట్టిన మాలాధారణ స్వాములు, భక్తుల కోసం శ్రీ ఉమామహేశ్వర దేవస్థానంలో ఉచిత వైద్య శిబిరాన్ని సిద్ధాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి పాదయాత్రగా శ్రీశైలం వెళ్తున్న శివస్వాములు ఉమామహేశ్వర దేవస్థానాన్ని దర్శించుకుని వెళుతున్న సందర్భంగా కొండపై సిద్దాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రంగాపూర్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో భక్తులకు ప్రాథమిక చికిత్స, వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నారు. గత వారం రోజులుగా శివదీక్ష చేపట్టిన స్వాములు, భక్తులు పాదయాత్ర ద్వారా శ్రీశైల క్షేత్రానికి ప్రయాణిస్తున్నారు. శ్రీశైలం వెళ్లే మార్గమధ్యంలో అక్కడక్కడ వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి భక్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, ఉచితంగా మందులు అందించడం జరుగుతున్నట్లు పిహెచ్సి సిద్దాపూర్ వైద్యాధికారి కె చందులాల్ తెలిపారు. ఇట్టి మెడికల్ క్యాంపు ఈ నెల 16 వరకు నిర్వహించబడుతుందని, స్వాములు, భక్తులు ఇట్టి సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వర దేవస్థానం కమిటీ ఈవో శ్రీనివాసరావు, వైద్య సిబ్బంది సీనియర్ ఫార్మసిస్ట్ భగత్ సింగ్, ఎమ్ ఎల్ హెచ్పి లు సుస్మిత, అమరావతి, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply