WGL | వివాహిత ఆత్మహత్య కేసులో.. నిందితులకు జైలుశిక్ష

పెద్దవంగర, జులై 8 (ఆంధ్రప్రభ): వివాహిత మృతికి కారణమైన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. పెద్ద వంగర (Peddavangara) మండల ఎస్సై క్రాంతి కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. అవుతాపురం గ్రామానికి చెందిన వేముల ఝాన్సీ (Vemula Jhansi) ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందింది.

ఆమె మృతికి అవుతాపురం గ్రామానికి చెందిన సలిదండి ప్రవీణ్, తొర్రూరు పట్టణానికి చెందిన చిదిరాల రాజు కారణమని, వారిద్దరిపై అనుమానం ఉందని మృతురాలి తండ్రి చింతకింది వెంకట సోమయ్య (Venkata Somaiya) ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి, కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి వారికి 12రోజుల రిమాండ్ విధించారని, నిందితులను మహబూబాబాద్ సబ్ జైలుకు తరలించినట్లు ఎస్సై క్రాంతి కిరణ్ తెలిపారు.

Leave a Reply