జాతీయ రహదారిపై ప్రమాదం..

వెల్దండ, ఆంధ్రప్రభ: హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై పెద్దాపూర్–చెరుకూరు గ్రామాల సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
వంగూరు మండలం నర్సంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి, తన ఇద్దరు కూతుళ్లతో కలిసి బైక్ పై హైదరాబాద్ నుండి స్వగ్రామం వెళ్తుండగా, చెరుకూరు–పెద్దాపూర్ దగ్గర డీసీఎం వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడికక్కడే మరణించారని తెలిపారు.
మరో ఇద్దరు తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.
అదేవిధంగా, ఆ సమయంలో హైదరాబాద్‌కు వెళ్లుతున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. స్థానికులతో మాట్లాడుతూ అవసరమైన చర్యలను తీసుకోవాలని అధికారులకు సూచించారు.
