సంగారెడ్డి : కంది మండలం{Kandi ) చేర్యాల +cheryala) గేటు వద్ద బధవారం అర్ధరాత్రి లారీని కారు ఢీ కొనడంతో ఫిల్మ్‌నగర్ (Film Nagar) ఎస్ఐ రాజేశ్వర్ ( SI Rajeswar ) మృతిచెందారు. బల్కంపేట (balkampet} ఎల్లమ్మ ఆలయం వద్ద బందోబస్తు నిర్వహించి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ రాజేశ్వర్ సంగారెడ్డిలోని చాణక్యపురి కాలనీలో నివాసం ఉంటున్నారు. ఎస్ఐ మృతిచెందడంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Accident| లారీని ఢీకొన్న కారు – ఫిల్మ్ నగర్ ఎస్ ఐ దుర్మరణం
