Accident | ఆటో – కారు ఢీ: నలుగురు దుర్మరణం

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలు పనుల నిమిత్తం ఆటోలో బయలుదేరి వెళుతుండగా ఆత్మకూరు మండలంలోని ఏఎస్‌ పేట క్రాస్ రోడ్డు వద్ద ఆటోను కారు బలంగా ఢీ కొంది. ఈ ఘటనలో 4 గురు మృతి చెందగా.. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఆటోను కారు ఢీకొన్న ఈ ఘటనలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. కూలీలు వెంకటరావుపల్లి నుంచి ముస్తాపురంకు ఆటోలో వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply