పాట్నా :: బిహార్ రాష్ట్రం కతిహార్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం లో ఏకంగా ఎనిమిది మంది దుర్మరణం చెందారు.
వివరాల్లోకి వెళితే.. సుపాల్ ప్రాంతానికి చెందిన కొందరు వివాహా వేడకలకు హాజరై తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలోనే వారి కారు జాతీయ రహదారి 31పై పోతియా గ్రామం సమేలి బ్లాక్ ఆఫీసు వద్దకు రాగానే ఎదురుగా ఉన్న ట్రాక్టర్ ను బలంగా ఢీకొట్టింది.ఈ దుర్ఘటనలో మొత్తం ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.