ఆంధ్రప్రభ ఇంద్రవెల్లి,ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నీ ఇద్దరి మృతి చెందిన సంఘటన ఇంద్రవెల్లి మండలం ధనోరా (బీ)గ్రామ సమీపంలో పిప్రి ఎక్స్ రోడ్ మలుపు వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. 108 అంబులెన్స్ పైలెట్ అశోక్ ,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇంద్రవెల్లికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త చింతవార్ దీపక్ (58) జాలం తాండ గ్రామానికి చెందిన తన మునిమ్ అజయ్ తో కలిసి అదిలాబాద్ నుండి ఇంద్రవెల్లికి వైపు బైకు పై వస్తుండగా దనోరా (బీ) గ్రామానికి చెందిన షేక్ శాద ప్ (19) అనే యువకుడు మూత్నూర్ నుండి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు డీ కొన్నాయి.
ఈ ప్రమాదంలో చింతవార్ దీపక్ ,షేక్ సదప్ లు తీవ్ర గాయాలయి అక్కడికక్కడే మృతి చెందగా జాలం తండాకు చెందిన తండాకు చెందిన అజయ్ కు తీవ్ర గాయాలు కాగా అంబులెన్స్ లో అదిలాబాద్ రిమ్స్ కు తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలుసుకునే ఎస్ఐ సాయన్న ఘటన స్థలానికి చేరుకొని జరిగిన రోడ్డు ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతి దేహాలను అదిలాబాద్ రిమ్స్ కు తరలించినట్లు తెలిపారు