ట్రిబుల్ ఐటీలో అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ అండ్ ఇన్క్యూబేషన్ సెంటర్

ఎచ్చెర్ల(శ్రీకాకుళం), అక్టోబర్ 12 (అంద్రప్రభభ): విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆవిష్కరణ దృష్టి, సాంకేతిక ప్రతిభను పెంపొందించేందుకు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) శ్రీకాకుళంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ అండ్ ఇన్క్యూబేషన్ సెంటర్ ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సెంటర్‌ను ఆప్షన్‌మేట్ రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో భాగస్వామ్యంగా ఏర్పాటు చేశారు.

కార్యక్రమానికి ఐఐఐటి డైరెక్టర్ కె. వీ. జి. డి. బాలాజీ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా ఆప్షన్‌మేట్ మేనేజింగ్ డైరెక్టర్ పి. శశికుమార్ పాల్గొన్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ముని రామకృష్ణ, డీన్ ఆఫ్ అకాడెమిక్స్ ఎస్. రామకృష్ణ, ఫైనాన్స్ ఆఫీసర్ సి. హెచ్. వాసు, డీన్ ఆఫ్ స్టూడెంట్ వెల్ఫేర్ జి. రవి, అసోసియేట్ డీన్ కె. రమణ, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి సి. ప్రకాశ్, కోఆర్డినేటర్ (ఎంట్రెప్రెన్యూర్షిప్ అండ్ ఇంక్యూబేషన్) ఎస్. సతీష్, ఇతర విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు.

Leave a Reply