శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి జిల్లా (Sri Sathya Sai District) కదిరి పట్టణం (Kadiri Town)లో ఆదివారం తెల్లవారుజామున ఓ యువకుడు కరెంట్ షాక్(Current Shack) తో దుర్మరణం చెందాడు. ఈ దుర్ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లా (Kadapa District) ప్రొద్దుటూరు టౌన్, సున్నపు బట్టి వీధికి చెందిన అన్వర్ బేగ్ కుమారుడు హాజీవలి (24) కదిరి టౌన్ లోని అరబిక్ రెస్టాంరెంట్ (Arabic Restaurant)లో సప్లయర్ గా పని చేస్తున్నాడు. మోర్ సూపర్ మార్కెట్ (More Supermarket) ఎదురుగా అల్లా బకాష్ అనే వ్యక్తి ఇంటిలోని పై పోర్షన్ లో తన స్నేహితులతో కలిసి బాడుగకు ఉంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున 02 గంటల సమయంలో భోజనం చేసిన పార్సిల్ కవర్లను పారవేసే క్రమం లో.. ఇంటి పక్కన వెళుతున్న 11 కిలో వాట్ల కరెంట్ వైర్ కు చేయి తగిలి హాజీవలి షాక్ కు గురయ్యాడు. అకస్మాత్తుగా మెట్ల మీద పడిపోయాడు. అతడిని కదిరి ప్రభుత్వ హాస్పిటల్(Kadiri Government Hospital)కు స్నేహితులు తరలించారు. కానీ అప్పటికే హాజీవలి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసును సీఐ నారాయణరెడ్డి దర్యాప్తు ప్రారంభించారు.
కదిరిలో కరెంట్ షాక్తో యువకుడు మృతి
