అభివృద్ధి చేస్తా… ఆదరించండి

  • ప్రచారంలో దూసుకెళ్తున్న యువ నాయకుడు,

తొర్రూరు క్రైం, ఆంధ్రప్రభ : పత్తేపురం గ్రామ సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి ఇట్టే మాధవరెడ్డి తెలిపారు. గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఇంటింటా తిరుగుతూ తన గుర్తు బ్యాట్ గుర్తుకు ఓటేయాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు.

పార్టీలకతీతంగా గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని, యువత, ప్రజలు, రైతులు తనకు అండగా నిలుస్తుండటం ఉత్సాహాన్ని పెంచుతోందని మాధవరెడ్డి చెప్పారు. చిన్నా-పెద్దా తేడా లేకుండా ప్రతి గడపకు వెళ్లి చిరునవ్వుతో పలకరిస్తూ, ముఖ్యంగా డ్రైనేజీ సమస్యను ప్రాధాన్యంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు.

ప్రతి కాలనీకి సీసీ రోడ్ల నిర్మాణం, విద్యావంతులకు ఉపాధి అవకాశాల కల్పన, విద్యా–వైద్య రంగాల అభివృద్ధి, రైతుల సమస్యల పరిష్కారం తన ముఖ్య ఎజెండా అని స్పష్టం చేశారు. పల్లెల్లో మార్పు రావాలంటే బలమైన, నూతన ఆలోచనలతో కూడిన యువ నాయకత్వం అవసరమని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న చిన్నా-పెద్దా సమస్యలను శ్రద్ధగా విని, గ్రామాన్ని ముందు వరుసలో నిలిపేందుకు తాను సిద్ధమని మాధవరెడ్డి చెప్పారు.

Leave a Reply