ఏడాది గడిచింది.. పట్టించుకునే వారేరి..?

ఏడాది గడిచింది.. పట్టించుకునే వారేరి..?
ఘంటసాల – ఆంధ్రప్రభ : ఘంటసాల గ్రామంలోని సంపద సృష్టి కేంద్రం నుంచి చిలకలపూడి వరకు రహదారిని తవ్వి ఏడాది గడుస్తున్నా నిర్మాణం పూర్తి కాలేదు. రాళ్లు పైకి లేచి నడిచేందుకు ఇబ్బందికరంగా మారింది. చిలకలపూడి గ్రామం నుంచి ఘంటసాల రావడానికి, ఘంటసాల నుంచి చిలకలపూడి, మొవ్వ గ్రామాలకు వెళ్లేందుకు ఇది ప్రధాన రహదారి. ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రయాణం సాగిస్తున్నారు. రహదారి నిర్మాణం పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
