Anantapur | సెట్ర‌ల్ యూనివ‌ర్సిటీ వ‌ద్ద ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం…

అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యూనివర్సిటీ ప్రధాన గేటు దగ్గర విద్యార్థులు నిరసన తెలిపారు. మెయిన్ గేటు దగ్గర సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థినులు బైఠాయించి ఆందోళ‌న చేపట్టారు.

లేడీస్‌ హాస్టల్‌లోని బాత్‌రూమ్‌లోకి కొందరు తొంగిచూస్తున్నార‌ని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. బాత్ రూం సమీపంలో నిచ్చెన ఉండడం గమనించి బాలికలు ఇన్ చార్జి వీసీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు యూనివర్సిటీ దగ్గరకు చేరుకున్నారు. ఆందోళన విరమించాలని యూనివర్సిటీ అధికారులు, పోలీసులు విద్యార్థులకు చెప్పారు. సమస్యపై విచారణ జరిపి పరిష్కరించే వరకు విశ్రమించేది లేదని విద్యార్థులు చెబుతున్నారు.

Leave a Reply