భారత సినీ పరిశ్రమలో ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న సినిమాల ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. మహావతార నరసింహ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధిస్తున్న వేళ, తాజాగా మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు మేకర్స్.

శ్రీకృష్ణ జయంతి సందర్భంగా “మహోబా” అనే కొత్త సినిమా రానుందని వెల్లడించారు. ఈ చిత్రాన్ని శ్రీజీ ఎంటర్‌టైన్‌మెంట్స్ – అభయ్ చరణ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి “శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా” అనే టైటిల్‌తో అధికారికంగా ఒక సోస్ట‌ర్ విడుదల చేశారు. అనిల్ వ్యాస్ నిర్మాణంలో, ముకుంద్ పాండే దర్శకత్వంలో ఈ మహాకావ్యం తెరకెక్కుతోంది.

శ్రీకృష్ణుని ఆధ్యాత్మికతతో పాటు యుద్ధ వీరుడి రూపాన్ని ఈ సినిమాలో ప్రతిబింబించనున్నారు. ముఖ్యంగా, కృష్ణుడిని యోధుడిగా చూపించే తొలి చిత్రం కావడంతో ఇది ప్రత్యేకత సంతరించుకుంది. భారీ బడ్జెట్‌తో పాన్-వరల్డ్ మూవీగా రూపొందిస్తున్నారు.

“శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా” ఒక డివోషనల్ – ఎపిక్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే పోస్టర్‌తోనే భారీ అంచనాలు పెంచిన ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Leave a Reply