ఆక‌స్మిక త‌నిఖీ…

ఆక‌స్మిక త‌నిఖీ…

మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఈ రోజు మక్తల్ పట్టణంలోని మహాత్మా జ్యోతి బాపూలే(Mahatma Jyoti Bapule) బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల బోధనా సామర్థ్యాన్ని పరిశీలించారు.

పదో తరగతిలో గతేడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు వండిన మధ్యాహ్న భోజనం(Bapule, lunch) నాణ్యతను పరిశీలించేందుకు గాను విద్యార్థులతో కలిసి ఆమె మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సంద‌ర్భంగా పాఠ‌శాల‌లో నిర్వహించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్(Abul Kalam Azad) జయంతి వేడుకల్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు.

Leave a Reply