సృజనాత్మకతకు వేదికగా…

  • షార్ట్ ఫిల్మ్స్, ఫోటోగ్రఫీ పోటీలకు ఆహ్వానం..
  • జిల్లా స్థాయిలో విజేతలకు రాష్ట్రస్థాయి పోటీ ఛాన్స్..

హుస్నాబాద్, (ఆంధ్రప్రభ) : శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అందిస్తున్న సేవలకు సంబంధించిన అంశాలపై షార్ట్ ఫిల్మ్స్, ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నట్లు హుస్నాబాద్ ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి తెలిపారు. యువకులు, ఔత్సాహికులు ఈ పోటీల్లో పాల్గొనాలని ఆయన కోరారు.

పోలీసులు చేసిన సేవలు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, కమ్యూనిటీ పోలీసింగ్, మూఢనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలు, అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన, ప్రకృతి వైపరీత్యాలలో పోలీసుల సేవలు, పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంచే ఇతర అంశాలపై ఈ పోటీలు జరుగుతున్నాయి.

  • షార్ట్ ఫిల్మ్స్ వీడియోలు మూడు నిమిషాలకు తగ్గకుండా ఉండాలి.
  • ప్రతిభ కనబరిచిన మొదటి మూడు ఫోటోలు, వీడియోలకు జిల్లా స్థాయిలో బహుమతులు అందజేస్తారు.
  • జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన వారికి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది.

పోటీకి సంబంధించిన ఫోటోలు, షార్ట్ ఫిల్మ్‌ (పెన్ డ్రైవ్‌లో)ను ఈ నెల 23వ తేదీ లోపు పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని పీఆర్‌ఓ (PRO)కు అందజేయాలని ఎస్సై లక్ష్మారెడ్డి తెలియజేశారు.

Leave a Reply