డీపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేత..

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : నల్లబెల్లి మండలంలోని మూడు చెక్కలపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ సర్పంచ్ సపావత్ కవిత దేవు నాయక్ నేతృత్వంలో గురువారం నర్సంపేట ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కవిత దేవు నాయక్ మాట్లాడుతూ.. మూడు చెక్కలపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థులు,ఉద్యోగులు, కూలీలు,రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రవాణా సౌకర్యాలు సరిగా లేకపోవడంతో నిత్యం వివిధ పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇస్లావత్ స్వరూప నెహ్రూజీ, అలాగే ఏబీవీపీ జిల్లా కన్వీనర్ బానోతు శ్రావణ్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply