YCP | మహానుభావుడు..

YCP | మహానుభావుడు..


YCP | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డ వైసీపీ పార్టీ కార్యాలయంలో మహానుభావుడు మహాత్మ జ్యోతిరావు పూలే (Mahatma Jyotirao Phule) వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి అవనిగడ్డ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేపల్లె శ్రీనివాసరావు, యువజన విభాగం అధ్యక్షులు చింతలపూడి బాల భాస్కరరావు(బాలు), వైఎస్ఆర్సీపీ అవనిగడ్డ మండలం బీసీ నాయకులు అవనిగడ్డ రంగనాథ్, వైసీపీ రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శి గాజుల జయ గోపాల్(గోపి), అవనిగడ్డ మాజీ సర్పంచ్ నలుకుర్తి పృథ్విరాజ్, పార్టీ నాయకులు అవనిగడ్డ శ్రీనివాసరావు, అవనిగడ్డ సాంబశివరావు, బొర్రా రామకృష్ణ, గరికపాటి కృష్ణారావు, మాదివాడ మారుతి, పరుచూరి లంకేశ్వరరావు, మునిపల్లి ఇజ్రాయిల్, అన్నపురెడ్డి పరమాత్మ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొని మహాత్మ జ్యోతిరావు పూలే, చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Leave a Reply