NIZAMABAD | ఘనంగా కళ్యాణ మహోత్సవం …

NIZAMABAD | ఘనంగా కళ్యాణ మహోత్సవం …

NIZAMABAD | ఎడపల్లి, ఆంధ్రప్రభ :  ఎడపల్లి మండలం జానకంపేట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో మంగళవారం కార్తిక మాసం స్వాతి నక్షత్రం పురస్కరించుకొని భక్తిశ్రద్ధల మధ్య లక్ష్మి నరసింహ స్వామి (Lakshmi Narasimha Swamy) కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయి పర్వదిన వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిజామాబాద్‌కు చెందిన కొండ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

భక్తులకు అపారంగా అన్నప్రసాదం పంపిణీ చేసి సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కళ్యాణ మహోత్సవాన్ని శ్రీరంగం కొండమాచారి (Srirangam Kondamachari) నాయకత్వంలోని పరిచారకులు, అర్చక వర్గం పూర్తి వైభవంతో నిర్వహించారు. ప్రత్యేక పూజలు, మంగళ హారతులతో దేవస్థానం అంతటా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. భక్త బృందం పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని దర్శించుకోవడం అదృష్టంగా భావించారు.

Leave a Reply