ఆర్పీఎఫ్ సిబ్బందికి ఘన సన్మానం…

కరీమాబాద్, ఆంధ్రప్రభ : ఆల్ ఇండియా పోలీస్ మీట్‌లో ప్రతిభ కనబరిచి రెండు బంగారు పతకాలు, ఒక వెండి పతకం సాధించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను కాజీపేట ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా సన్మానించారు. గురువారం కాజీపేట ఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆర్పీఎఫ్ సీఐ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆల్ ఇండియా పోలీస్ మీట్‌లో ఆర్చరీ విభాగంలో రెండు బంగారు పతకాలు సాధించిన బోనాల శేఖర్, అలాగే హ్యాండ్‌బాల్‌లో వెండి పతకం సాధించిన జే. అనిల్ కుమార్లను వరంగల్ ఇన్‌స్పెక్టర్ పి. శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఎస్సైలు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. క్రీడల్లో ప్రతిభ చూపి శాఖకు మంచి పేరు తీసుకువచ్చినందుకు అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాగే మరిన్ని పతకాలు సాధించి పోలీస్ శాఖకు గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకటేశ్వర్లు, ఏఎస్ఐలు, ఆర్పీఎఫ్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
