కాశీబుగ్గ దుర్ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు
- తప్పుడు ప్రచారాల చేసిన వారి పై చర్యలు
- విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : పలాస కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోందని, వాస్తవాలు త్వరలోనే వెలుగులోకి తీసుకువస్తామని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి(DIG Gopinath Jetty) తెలిపారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో కొంతమంది అవాస్తవాలు, అసత్య, దుష్ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో ఆదివారం శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో విశాఖపట్నం(Visakhapatnam) డీఐజీ గోపీనాథ్ జట్టి శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి, విజయనగరం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్,డీఎస్పీలు ఇతర పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలు, అసత్య సమాచారం వ్యాప్తి చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరమన్నారు. ఇటువంటి పోస్టులు, వీడియోలు(Videos), వ్యాఖ్యలు చేస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నామని,.పోస్టులు పెట్టిన వారి వివరాలు లొకేషన్ ఆధారంగా గుర్తించి, అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని ఆయన హెచ్చరించారు. ప్రజలు వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అయన కోరారు పోలీసు శాఖ అధికారిక సమాచారం మాత్రమే నమ్మి, శాంతి భద్రతలకు సహకరించాలని డీఐజీ తెలిపారు.
జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర్ రెడ్డి(K.V. Maheshwar Reddy) ఆధ్వర్యంలో కాశీబుగ్గ తొక్కిసలాట కేసు దర్యాప్తు కొనసాగుతోందని, పోలీసులు అన్ని కోణాల్లో ఘటనపై విశ్లేషణ చేపట్టి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు రేంజ్ డీఐజీ తెలిపారు.

