నష్ట పరిహారం కోసం రోడ్డెక్కిన రైతన్న..

భైంసా, ఆంధ్రప్రభ ; రెండు రోజుల క్రితం ఈదురు గాలుల తో భారీ వర్షం కురవడం తో మొక్క జొన్న పంట పూర్తి స్థాయి లో కింద పడి పోవడం తో అపార నష్టం జరిగింది.. దీంతో తమకు నష్టం పరిహారం ఇవ్వాలని దేగాం రైతులు అక్కడే రహదారి పై భైఠాయించారు. రాస్తా రోకో జరగడం తో కొద్దీ సేపు వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. రాస్తా రోకోకు స్థానిక సర్పంచ్ సిరం సుష్మరెడ్డి సంఘీభావం ప్రకటించి రైతుల తో కలిసి ఆందోళన లో పాల్గొన్నారు. తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, రూరల్ సి ఐ. ప్రవీణ్, ఎస్. ఐ. సుప్రియ లు సంఘటన స్త లానికి చేరుకొని రైతులను సముదాయించారు.

పూర్తి స్థాయి లో సర్వే జరిపి ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ సిరం సుష్మ రెడ్డి పలువురు రైతులు మాట్లాడుతూ దేగాం తో పాటు పరిసర గ్రామాల్లో భారీ నష్టం జరిగిందని రైతుల వారిగా వివరాలు సేకరించి తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ భీమా పథకాన్ని అమలు చేస్తే రైతుకు నష్టపరిహారం లభించేది అన్నారు. ఇకనైనా జిల్లా అధికారులు తమ పంటలను పరిశీలిస్తే రైతుకు జరిగిన నష్టం ఏంటో తెలుస్తుందన్నారు.. అధికారులు సముదాయియించడం తో రాస్తారోకో ను విరమించారు. రాస్తారోకో లో గ్రామానికి చెందిన పెద్ద మొత్తం లో రైతులు పాల్గొన్నారు.

Leave a Reply