laxmanchanda | రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

laxmanchanda | రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

laxmanchanda | లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఇవాళ‌ పొట్టపల్లి-కే గ్రామంలో పోలీసు శాఖ “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత గురించి లక్ష్మణ చందా పోలీస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై ఎస్.శ్రావణి ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్లు ధరించడం, వేగాన్ని తగ్గించడం, కుటుంబం కోసం బాధ్యతగా డ్రైవింగ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ముఖ్యమైన అంశాలపై గ్రామ ప్రజలకు వివరించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలను కూడా పరామర్శించారు. కార్యక్రమం అనంతరం గ్రామ ప్రజలు యువకులచే రోడ్డు భద్రత గురించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శ్రీనివాస్ వర్మ, సర్పంచ్ ముకేశ్, ఉప సర్పంచ్ రవీందర్, పంచాయతీ కార్యదర్శి ప్రియాంక, గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply