BRS | పున‌ర్విభ‌జ‌న‌కు సర్కారు అడుగులు

BRS | పున‌ర్విభ‌జ‌న‌కు సర్కారు అడుగులు

  • తెరమీదకు క‌మిష‌న్
  • సీఎం రేవంత్ రెడ్డి ప్రక‌ట‌న‌
  • ముట్టుకుంటే బుగ్గే కేటీఆర్ వార్నింగ్‌

BRS | వెబ్ డెస్క్ (తెలంగాణ‌), ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ‌లో 2026వ సంవ‌త్స‌రం వ‌స్తూ.. వ‌స్తూ.. వైష‌మ్యాలు తీసుకొచ్చిన‌ట్టు అనిపిస్తోంది! తొలి అడుగులోనే ప్ర‌భుత్వం ఒక ప్ర‌క‌టన చేసింది.. ఇందుకు ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ కూడా వార్నింగ్ ఇచ్చింది. అయినా ప్ర‌భుత్వం (GOVT) వ‌డివ‌డి అడుగులు వేయ‌డం ఆప‌లేదు. ఈ ఏడాది మున్సిప‌ల్‌, ప‌రిష‌త్ ఎన్నిక‌లు కూడా ఉన్నాయి. అయితే ప్ర‌భుత్వం త‌గ్గ‌డం లేదు. అలాగే ఈ క్ర‌మంలో తెలంగాణ‌లో ప్ర‌భుత్వ‌, ప్ర‌తిప‌క్ష మ‌ధ్య అగ్గి రాజుకుంటుందా? అనేది చ‌ర్చ‌నీయాంశంగా ఉంది.

BRS | జిల్లాల విభ‌జ‌న అశాస్త్రీయం…

జిల్లాల విభ‌జ‌న అశాస్ర్తీయంగా జ‌రిగింద‌ని, జిల్లా పున‌ర్విభ‌జ‌న చేయాల్సి అవ‌స‌రం ఉంద‌ని ఈ నెల మొద‌టి వారంలో జ‌రిగిన అసెంబ్లీలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. కొన్ని జిల్లాలు కుదింపు, మ‌రికొన్ని జిల్లా ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌భుత్వం వ‌డివ‌డి అడుగులు వేస్తోంది. ఈ క్ర‌మంలో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో ఒక స‌భ‌లో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ వార్నింగ్ కూడా ఇచ్చారు. జిల్లాల‌ను ముట్టుకుంటే అగ్గి రాజుతుంద‌ని అన్నారు.

BRS | మ‌రో ముందడుగు వేసిన సీఎం

జిల్లాల పున‌ర్విభ‌జ‌న చేయ‌డానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తితో గానీ, హైకోర్టు (High Court) మాజీ న్యాయ‌మూర్తితో గానీ క‌మిష‌న్ ఏర్పాటు చేస్తాన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. అయితే ఈ క‌మిష‌న్ ఆరు నెల‌లు పాటు రాష్ట్రంలో ప‌ర్య‌టించి నివేదిక స‌మ‌ర్పించిన త‌ర్వాత జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌కు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. జిల్లాల పున‌ర్విభ‌జ‌న విష‌యంలో ప్ర‌భుత్వం వెనుక్కు త‌గ్గేట‌ట్లు లేద‌ని స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చింది.

BRS | మ‌రో ఉద్య‌మానికి బీఆర్ఎస్ సిద్ధం

జిల్లాల విష‌యంలో ప్ర‌భుత్వం వెనుక్కు త‌గ్గ‌క‌పోవ‌డంతో మ‌రో ఉద్య‌మానికి బీఆర్ఎస్ (BRS) సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు సంకేతాలు వెలువ‌డుతున్నాయి. క‌మిష‌న్ ప‌ర్య‌టించిన నాటి నుంచే ఉద్య‌మాల‌కు బీఆర్ఎస్ సిద్ధ‌మ‌య్యే అవ‌కాశం ఉంది. ఎందుకంటే జిల్లాల విభ‌జ‌న అనే అంశం అశాస్త్రీయం అనే ప‌దం ఉప‌యోగించింది కాబ‌ట్టి.. అప్ప‌టి జిల్లాలు శాస్త్రీయంగా జ‌రిగిన‌ట్టు బీఆర్ఎస్ శ్రేణులు నిరూపించాల్సి ఉంటుంది. ఈ విష‌యాన్ని క‌మిష‌న్ దృష్టికి బీఆర్ఎస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది.

CLICK HERE TO READ ఆవిష్కరించిన మంత్రి, ఎంపీ, ప్రముఖులు

CLICK HERE TO READ MORE

Leave a Reply