ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నేడు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ లతో భేటి అయ్యారు… ముందుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు ఎపికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చించారు. వాటికి అమిత్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం . ఆ తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళ్లిన ఎసి సిఎం అక్కడ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటి అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలు, అమరావతి, పోలవరం తదితర అంశాలపై ఆమెతో మాట్లాడారు. ఎపికి రావాలసిన నిధులను వెంటనే విడుదల చేయవలసిందిగా కోరారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు సీఎం రమేశ్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
