Utnoor Rural | ఇందిరమ్మ ఇండ్లతో పేదవారి కళ సాకారం

Utnoor Rural | ఇందిరమ్మ ఇండ్లతో పేదవారి కళ సాకారం

  • ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా ఇందిరమ్మ ఇంటికి ప్రారంభోత్సవం

Utnoor Rural | ఉట్నూర్ రూరల్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేసి పేదవారి ఇంటి కళా సాకారం చేస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా ఇవాళ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని దంతన్ పెల్లి లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ వేడుకల్లో పాల్గొని ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా ఇందిరమ్మ నూతన ఇంటిని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు లింగంపల్లి చంద్రయ్య దంపతులు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కుటుంబ సభ్యులకు సాంప్రదాయంగా కానుకలు ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎన్నో సంవత్సరాలుగా ఇల్లు లేని నిరుపేదలు పూరి గుడిసెల్లో నివసించి ఇబ్బందులు పడ్డారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నారని అన్నారు.

అర్హులైన నిరుపేదలకు దశలవారీగా ఇండ్లు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పతకాలు అందుతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రజల కలలు నెరవేరుతున్నాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అదిలాబాద్ ఆర్టిఏ మెంబర్ దూట రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లింగంపల్లి చంద్రయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇక్బాల్, జైనూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బానోత్ జైవంతరావు, కాంగ్రెస్ నాయకులు కొత్తపల్లి మహేందర్, యువ నాయకులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply