Chicago | స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి…

Chicago | స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి…

Chicago | చిట్యాల, ఆంధ్రప్రభ : స్వామి వివేకానందుడి బోధనలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని బీజేపీ మండల అధ్యక్షుడు పీక వెంకన్న ముదిరాజ్ అన్నారు. ఈ రోజు నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామంలో స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అధ్యక్షులు పీక వెంకన్న ముదిరాజ్ మాట్లాడుతూ…
యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ(Discipline), సేవాభావాన్ని పెంపొందించడంలో స్వామి వివేకానంద బోధనలు మార్గదర్శకమని అన్నారు. యువత లక్ష్యసాధనలో పట్టుదలతో ముందుకు సాగాలని, సమాజ సేవను తమ జీవిత లక్ష్యంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.

వివేకానందుని ఆలోచనలు నేటి యువతకు దిశానిర్దేశకమని, విద్య, క్రీడలు, సేవా కార్యక్రమాల ద్వారా సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలనిఅన్నారు. చికాగో(Chicago) మహానగరంలో భారతదేశ ఔన్నత్యాన్ని చాటిన మహానీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పీక మహేష్ ముదిరాజు ఆకుల వెంకన్న నరేంద్ర చారి ఐలయ్య శివకోటి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply