Olympiad | రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన అక్క, తమ్ముడు

Olympiad | రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన అక్క, తమ్ముడు
Olympiad | దండేపల్లి, ఆంధ్రప్రభ : ఇటీవల మంచిర్యాల జిల్లాలోని ఉన్నత పాఠశాలల ఆధ్వర్యంలో జరిగిన ఆంగ్ల ప్రతిభ పాఠవ జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలు, ఒలింపియాడ్(Olympiad) పోటీలను నిర్వహించగా, దండేపల్లి మండలంలోని గుడిరేవు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో9 వ తరగతి చదువుతున్న సంతపురి అహల్య ఉపన్యాసం సీనియర్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలువగా ఆమె తమ్ముడు 8వ తరగతి చదువుతున్న సంతపురి అలెగ్జాండర్ ఒలింపియాడ్ జూనియర్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచాడు.
పోటీలో ఎంపికైన విద్యార్థులను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లూరి శ్రీనివాస్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఒకే పాఠశాల నుండి ఇద్దరు అక్క, తమ్ముడు రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎంపిక కావడంతో పాఠశాల ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకొని మరింత పై స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు బండారి శ్రీనివాస్, బి. రాజశేఖర్, అనిత, సల్మా, లచ్చన్న నరేందర్ ఖండు, గ్రామస్తులు పాల్గొన్నారు.
