Sindhu Returned : సింధూ ఆగయా,,​ AndhraPrabha Sports News

Sindhu Returned : సింధూ ఆగయా,,​ AndhraPrabha Sports News

సెమీస్​ లో  ప్చ్.. బ్యాడ్ లక్

సీజన్​ ఆరంభంలోనే..తడాఖ ప్రదర్శన

వరల్డ్​ చాంపియన్​ ఎడిషన్​ పై ఫోకస్​

నెక్ట్స్​ .. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్

ఫైనల్​ ఒలింపిక్స్​..

ఆ తరువాత రిటైర్​మెంటే..  

( ఆంధ్రప్రభ, స్పోర్ట్స్​ డెస్క్) ​

Sindhu Returned :  ప్రంపంచ  బాడ్మింటన్​ సీజన్​ ఆరంభ టోర్నీ.. మలేషియా ఓపెన్​ 2026 లో భారత స్టార్​ షట్లర్ ​ పీవీ సింధూ (Pv Sindhu)  సెమీస్​ కు చేరుకోవటంతో.. మలేషియా కప్​ కొట్టి.. సంక్రాంతి కానుకగా.. స్వేదేశానికి అందజేస్తుందని అందరూ ఆశించారు. కానీ  శనివారం జరిగిన   సెమీ ఫైనల్ మ్యాచ్ (Semi Final)​ లో తొలిసెట్​ లో   16-..21, రెండవ సెట్​ లో  15..-21 తేడాతో డ్రాగన్​ షట్లర్​ (Dragon Shatler)   వాంగ్ జియి చేతిలో పీవీ సింధూ ఓడిపోయింది.

Sindhu Returned

గాయం కారణంగా సుదీర్ఘ కాలం   విరామం తీసుకున్న సింధూ  మలేషియా  టోర్నీలో  అడుగు పెట్టింది.  నిజానికి ఈ టోర్నీపై అంతగా ఆశలు పెట్టుకోలేదు.  2027లో జరిగే లాస్ ఏంజిల్స్ (Olympics) ఒలింపిక్స్ పైనే ఫోకస్​ పెట్టింది.  రిటైర్​ మెంట్​ (Retirement)  స్టేజీకి చేరిన స్థితిలో.. ఒలింపిక్స్​ లో మరో సారి తన సత్తా చాటాలని తీవ్రంగా ప్రాక్టీస్​ చేస్తోంది. శుక్రవారం  క్వార్టర్స్​ ఫైనల్స్​ అకస్మాత్తుగా సీన్​ రివర్స్​ చేసింది. బాడ్మింటన్​   సీజన్- ఆరంభ మలేషియా ఓపెన్‌లో  సెమీ-ఫైనల్స్‌కు దూసుకెళ్లి  సింధు వచ్చిందోచ్​ (Sindhu  Returned) ​ అని నిరూపించింది. 2021 తర్వాత సూపర్ 1000 టోర్నమెంట్‌లో 8 ఏళ్ల తర్వాత మలేషియా ఓపెన్‌లో  తొలిసారిగా సింధూ సెమీఫైనల్ కు చేరుకుంది.  ఈ టోర్నీలో ఫైనల్​ కు చేరుకుని లేడి లెజండ్​ ఆగయా అని అభిమానులు ఉర్రూతలూగుతారని భావించారు.

కానీ చైనా మహిళల బ్యాడ్మింటన్‌లో నంబర్ వన్, ప్రపంచ 2వ ర్యాంకు షట్లర్​   వాంగ్ జియిని సింధూ తట్టుకోలేకపోయింది. శనివారం జరిగిన హోరాహోరీ సెమీఫైనల్ పోరులో 16..-21, 15-.. 21 తేడాతో వాంగ్ జియి(Wang Zhiyi) చేతిలో సింధు ఓడిపోయింది. సుదీర్ఘ గాయం తర్వాత పునరాగమనం చేసిన సింధు, ఈ టోర్నీలో సెమీస్‌కు చేరి తన పాత ఫామ్‌ను తిరిగి ప్రదర్శించింది. ఈ టోర్నీలో వాంగ్ జియి అత్యంత నిలకడగా ఆడుతూ క్వార్టర్స్‌లో ఇండోనేషియా షట్లర్​  పుత్రి కుసుమ వర్దానీని ఓడించి సెమీస్‌కు చేరింది ఆమె అద్భుతమైన డిఫెన్స్,  షార్ప్ కౌంటర్ -ఎటాక్స్‌ను సింధూ ప్రతిఘటించలేక పోయింది.

సింధూ ఎదుర్కొన్న  క్వార్టర్​ ఫైనల్​ మ్యాచ్​  కేవలం 11 నిమిషాలు మాత్రమే సాగింది. తొలి సెట్‌లో సింధు 21..-11తో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.   రెండో సెట్ ప్రారంభానికి ముందే మోకాలి గాయం కారణంగా యమగుచి మ్యాచ్ నుంచి  వైదొలిగింది,  (Retired Hurt) సింధును విజేతగా ప్రకటించారు. ఈ విజయంతో యమగుచిపై సింధు హెడ్ -టు-హెడ్ రికార్డు 15..-12కు మెరుగైంది.

Sindhu Returned

Sindhu Returned :  ఆఫ్టర్​ ఒలింపిక్స్​..? తాజాగా కోర్టులో సింధు  దృఢంగా   కనిపించింది. తొలి రౌండ్‌లో దిగువ ర్యాంక్‌లోని సంగ్ షువో యున్‌ను తొలి సెట్​లో  21..-13, రెండవ సెట్​ లో  22.. -20 తేడాతో  సింధూ ఓడించింది. తర్వాత, ఆమె ప్రపంచ 9 వ ర్యాంకర్​  జపాన్‌ షట్లర్​  టోమోకా మియాజాకిపై  దాటిగా ఆడింది.  ప్రపంచంలో 18 వ ర్యాంక్‌లో ఉన్న సింధు ఎనిమిదో సీడ్‌ను 21..-8,  21-..13 తేడాతో ఓడించి,  బాడ్మింటన్​ సీజన్​ లో తన రీ ఎంట్రీ స్థాయిని నిరూపించింది. మలేషియా  తాజాగా  ఫామ్‌లోని  షట్లర్లను మలేషియా టూర్​ లో ఢీకొని  తనను తాను పరీక్షించుకోవడానికి లభించిన అవకాశాన్ని సింధూ సద్వినియోగం చేసుకుంది.

Sindhu Returned

 సీజన్ -ప్రారంభ పరుగులో సింధూ  ఉత్సాహంగా కనిపించింది.  రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత సింధూ  ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ వైపు దృష్టి సారించే ముందు వచ్చే వారం భారతదేశానికి తిరిగి వస్తోంది.  16 సంవత్సరాల తర్వాత స్వదేశంలో ప్రపంచ ఛాంపియన్‌ షిప్ ఎడిషన్ లో తన సత్తాను చాటుకునేందుకు శ్రమిస్తోంది. ఇక (Los Angeles Olympics)  లాస్​ ఏంజిల్స్​ ఒలింపిక్స్​ తరువాత.. సింధూ వెటరన్​ షట్లర్​ గా మారనున్నారు.

ALSO READ : AP CM with Farmer  మోసం లేదు Andhra Prabha Live News

Leave a Reply