






ఉత్తరప్రదేశ మథురా బృందావనంకు చెందిన ప్రపంచ విఖ్యాత మత గురువు ఆచార్య శ్రీ దేవ్ మురారి బాపు జీ గారు అనేక జాతీయ స్థాయి మత మరియు సామాజిక సంస్థలలో ప్రధాన నాయకత్వ పదవులను కలిగి ఉన్నారు. వీరు ఇటీవల అంతర్జాతీయ ధర్మాచార్య అనే ప్రతిష్టాత్మక పదవిని పొందారు.ఈ సంధర్భంగా వీరి గౌరవార్ధంగా బ్రహ్మ కుమారీస్ – శాంతి సరోవర్, హైదరాబాద్ లో ఓ సన్మాన కార్యక్రమాన్ని మంగళవారం, 4 మార్చి 2025న సాయంత్రం 6:30 గంటలకు నిర్వహించబడినది. బ్రహ్మాకుమారీస్ వారి దగ్గర కొనసాగుతున్న శివరాత్రి మహోత్సవ వేడుకల్లో భాగంగా జరిగిన శివ పరమాత్మ ధ్వజారోహన కార్యక్రమం లో కూడా ఆచార్యులు పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మాకుమారీస్, హైదరాబాద్ శాఖల ఇంచార్జ్ రాజయోగిని బి.కె.కులదీప్ దీదీ, బి.కె.అంజలి, మౌంట్ ఆబూ నుండి నిచ్చేసిన చంద్రేశ్, శ్రీకాంత్, ఇతర ప్రముఖులు మరియు వివిధ ప్రాంతాల నుండి వందల మంది భక్తులు పాల్గొన్నారు.
ఆచార్యులు మాట్లాడుతూ – ప్రపంచంలో ఇప్పుడు చాలా అలజడి, అశాంతి వ్యాప్తి చెందింది, మనుష్యులలో వెలితి ఎక్కువ అవుతోంది… ఆధ్యాత్మిక చింతన, జీవన సరళి దీనికి సరైన పరిష్కారం… బ్రహ్మాకుమారీస్ సంస్థగురించి నాకు చాలా సంవత్సరాలుగా నాకు తెలుసు, వారి భోధనలు, జీవన విధానం గురించి మంచి అవగాహన నాకుంది… వారి ముఖ్యాలయం మౌంట్ ఆబూకు, దేశంలోని వివిధ ప్రాంతలలో వారి అనేక కార్యక్రమాలకు కూడా వేళ్ళాను, బ్రహ్మాకుమారీస్ సేవలు, భోదనలు ప్రతి ఒక్కరికి అవసరం, ఎందుకంటే వారు చాలా నిస్వార్థంగా సేవలు చేస్తారు. శివ పరమాత్మ జ్ఞానం అందరి అందిస్తారు. నేటి ప్రపంచంలో అందరూ ఆధ్యాత్మికత వైపు మొగ్గుచూపాలి… బ్రహ్మాకుమారీస్ లాంటి స్వచ్చమైన సంస్థను నిందించే లేక అసలు విషయాలను వక్రీకరిస్తున్న కొంతమంది చాలా తప్పు చేస్తున్నారు… అలా నిందించేవారి మనసు ఎంత అశాంతి మలినముగా ఉన్నాయో అర్థమవుతోంది… అయినా కాని బ్రహ్మాకుమారీస్ ప్రేమ, శాంతి, సత్యతకు కట్టుబడివున్నారు, అందరికీ ఆదర్శంగా ఉన్నారు… సనాతన ప్రపంచ స్థాపనకు కృషి చేస్తున్న, ఈ సంస్థకు మా పూర్తి మద్ధతు ఉంది.