Helping | స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం

Helping | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామంలో వారితో పాటు కలిసి చదువుకున్న చిన్ననాటి స్నేహితుడు తొడేటి అజయ్ అనుకోకుండా హఠాత్ మరణం చెందాడు. దీనితో వారి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. వారిది నిరుపేద కుటుంబం కావడంతో అతనితో పాటు కలిసి చదువుకున్న మిత్రులందరు కలిసి ఆర్థిక సహాయం చేద్దామని ముందుకు వచ్చారు. ఈ రోజు 1996-97 ఎస్ఎస్ సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు (మహిళలు, పురుషులు) అజయ్ కుటుంబ సభ్యులకు ఆర్థిక చేయూతను అందించారు.
రూ .61,500 నగదును వారి కుటుంబ సబ్యులు (భార్య)కు అందజేశారు. అలాగే వారి కుటుంబానికి ఎటువంటి కష్టం రాకుండా అండగా ఉంటామని భరోసాను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 1996-1997 ఎస్ఎస్ సి బ్యాచ్ సభ్యులు సర్పంచ్ ఏనుగందుల శైలేందర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, తిరుపతి, డాక్టర్ అజీమ్, సాయి కృష్ణ, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్, తిరుమలేష్, దన్ రెడ్డి, మధు గౌడ్, నర్సయ్య, ఏవైఎస్ మండల అధ్యక్షుడు సుంకరి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
