Foundation | వసతుల కల్పనకు ‘అభయ’ హస్తం

Foundation | వసతుల కల్పనకు ‘అభయ’ హస్తం

  • ఎడపల్లి పాఠశాల లో రోజుకు ఒక్క రూపాయి…మన కోసం, మన పాఠశాల కోసం” అనే వినూత్న కార్యక్రమానికి అంకురార్పణం…
  • పాఠశాల ఆవరణం లో భోజనశాల ఏర్పాటుకు ఫౌండేషన్ సహకారం
  • ఆరు రాష్ట్రాలలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అభయ ఫౌండేషన్ విశేష కృషి
  • ఎడపల్లి బాలికల గురుకుల పాఠశాలకు సైతం 30 లక్షలతో మల్టీపర్పస్ హాల్ నిర్మాణం

Foundation | ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ రోజు “రోజుకు ఒక్క రూపాయి… మన కోసం, మన పాఠశాల కోసం” అనే బృహత్తర కార్యక్రమాన్ని ఎడపల్లి గ్రామ సర్పంచ్ కందగట్ల రాంచందర్, ఉపసర్పంచ్ మ్యాచ్కురి గంగాధర్ లు తాహసిల్దార్ దత్తాద్రి, మండల విద్యాశాఖ అధికారి గాలప్ప, ఎడపల్లి బాలికల గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగా శంకర్లతో కలిసి శనివారం ప్రారంభించారు.

పాఠశాల(School) ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ముందుగా మహిళా శక్తికి మార్గదర్శి సావిత్రి భాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశ సామాజిక చరిత్రలో మహిళా విద్యకు పునాది వేసిన గొప్ప శక్తి సావిత్రి భాయి పూలే అని వక్తలు పేర్కొన్నారు.

Foundation |

రోజుకు ఒక్క రూపాయి…మన కోసం, మన పాఠశాల కోసం అనే కార్యక్రమం ద్వారా పాఠశాలలో ఉన్న సుమారు 400 మంది విద్యార్థులు(400 students) రోజుకు ఒక రూపాయి చొప్పున జమ చేస్తే, వాటికి మూడింతలు కలిపి పాఠశాలలో పలు మౌలిక వసతుల కల్పనకు అభయ ఫౌండేషన్(Abhaya Foundation) ముందుకు వస్తుందని ఫౌండేషన్ వ్యవస్థాపకులు బాలచంద్ర సంకు ఇదివరకే స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, తహశీల్దార్ లు మాట్లాడుతూ.. ఇలాంటి బృహత్తర కార్యక్రమం ద్వారా విద్యార్థి దశనుండే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు డబ్బు ప్రాముఖ్యత, వాటి పొదుపు మార్గాలపై అవగాహన కల్పించుకునే ఆస్కారం ఉంటుందని అన్నారు. సుమారు ఆరు రాష్ట్రాలలో అభయ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయడం ఎంతో గొప్ప విషయం అని అన్నారు.

తను పాఠశాల విద్యను అభ్యసించి, గ్రామ సర్పంచ్ గా గెలిచి అదే పాఠశాలకు ముఖ్య అతిథిగా పాల్గొనడం ఎంతో గర్వంగా ఉందని సర్పంచ్ పేర్కొన్నారు. తాను విద్యను అభ్యసించిన పాఠశాలకు ఎప్పటికీ రుణపడి ఉంటారని, తన శక్తి మేర పాఠశాల అభివృద్ధి(Development)కి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తానని సర్పంచ్ తెలిపారు.

Foundation |

అనంతరం సర్పంచ్ తహసిల్దార్, మండల విద్యాశాఖ అధికారి, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవికుమార్, గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగా శంకర్ లను శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం సర్పంచ్ రామ్ చందర్ పాఠశాల ఉపాధ్యాయ బృందంతోపాటు, కార్యక్రమంలో పాల్గొన్న అతిథులతో కలిసి రోజుకు ఒక్క రూపాయి… మన కోసం, మన పాఠశాల కోసం” అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply