Bheemgal | మహిళా విద్యకు ఎంతో కృషి

Bheemgal | మహిళా విద్యకు ఎంతో కృషి
- భీమ్గల్లో సావిత్రీబాయి పూలే జయంతి
Bheemgal | భీమ్గల్ టౌన్ /రూరల్, ఆంధ్రప్రభ : మహిళా విద్యకు సావిత్రిబాయి ఎంతో కృషి చేశారని ఎన్ఎస్యూఐ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ రహమాన్ అన్నారు. భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా భీమ్గల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేటి సమాజంలో అణచివేతకు గురవుతున్నమహిళలకు, బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించడానికి సావిత్రిబాయి చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు. ఆ కాలంలో మహిళలు చదువుకోవడమే నేరంగా భావించే పరిస్థితుల్లో ఎన్నో అవమానాలను భరించి దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా రికార్డు సృష్టించారని గుర్తుచేశారు. జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ, బాల్య వివాహాల నిర్మూలనకు, వితంతు పునర్వివాహాలకు ఆమె అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు.
ఎన్ఎస్యూఐ ఎల్లప్పుడూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉండాలని కృషి చేస్తుందని స్పష్టం చేశారు. సావిత్రిబాయి పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, మహిళా సాధికారత కోసం పాత్ర ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రకాష్, నందు, కృష్ణ, తరుణ్, ప్రవీణ్, సర్జన, క్రాంతి, భాను, నందు, కృష్ణ, విగ్నేష్, సన్నీ, అఖిల్ పాల్గొన్నారు.
