కొత్త లీడర్లకు గ్రామసంఘం సన్మానం..

కొత్త లీడర్లకు గ్రామసంఘం సన్మానం..
నిజామాబాదు, భీంగల్ టౌన్, జనవరి 2 ( ఆంధ్రప్రభ ). మండలంలోని పిప్రి సర్పంచ్, ఉపసర్పంచ్ గా నూతనంగా ఎంపికైన లీడర్లను మహిళా సమాఖ్య గ్రామ సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేశారు. గ్రామసంఘం అధ్యక్షురాల్లు దుర్గి లక్మీ, లక్మీ ఆధ్వర్యంలో సర్పంచ్ అరిగేల జనార్దన్, ఉపసర్పంచ్ పతాని జేమ్స్ లను పూల మాల, శాలువా తో సత్కరించారు. ఈ సందర్బంగా సర్పంచ్, ఉపసర్పంచ్ మాట్లాడుతూ మహిళల సంక్షేమం కొరకు కృషి చేస్తామని తెలిపారు. మహిళలు ఏ సమస్యలు వచ్చిన దృష్టికి తెస్తే వాటిని పరిష్కరించేందుకు సహకరిస్తామని పేర్కొన్నారు. సన్మానం చేసిన మహిళా సంఘం సభ్యులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఐకేపీ సీసీ గడాల రఘుపతి, కార్యదర్శి శేఖర్, మహిళా సంఘం ప్రతినిధులు సువర్ణ, లక్ష్మి, రాజలక్మీ, వీణరాణి, సీఏ లు రౌతు నిరోషా, విశాల ఇతర మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.
