Swarnagiri | స్వర్ణగిరిలో కిక్కిరిసిన భక్తజనం

Swarnagiri | స్వర్ణగిరిలో కిక్కిరిసిన భక్తజనం

  • స్వామి వారిని దర్శించుకున్న కోవా లక్ష్మణ్

Swarnagiri | యాదాద్రి, ఆంధ్రప్రభ ప్రతినిధి : స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి మహా పర్వదినాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇవాళ‌ ఈ సందర్భంగా స్వర్ణగిరి క్షేత్రం(Swarnagiri Kshetra) భక్తులతో కిక్కిరిసిపోయింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వెంకటేశ్వరుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ ఇన్చార్జ్ బీజేపీ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు కోవా లక్ష్మణ్ కుటుంబ సమేతంగా ఉత్తర ద్వారం ద్వారా ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

స్వామివారి పాదాల వద్ద ఆలయ వ్యవస్థాపకులు మానేపల్లి రామారావు, మానేపల్లి మురళీకృష్ణ, మానేపల్లి గోపికృష్ణ ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ‌ వ్యవస్థాపకులు స్వామి వారి చిత్రపటాన్ని, లడ్డు ప్రసాదాన్ని లక్ష్మణ్ దంపతులకు అందజేశారు.

Swarnagiri |
Swarnagiri |
Swarnagiri |
Swarnagiri |
Swarnagiri |
Swarnagiri |
Swarnagiri |

Leave a Reply