petition | సీఎం సార్‌.. హామీ నెర‌వేర్చండి

petition | సీఎం సార్‌.. హామీ నెర‌వేర్చండి

  • మాదాసి కుర్వలకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి

petition | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం మాదాసి కుర్వలకు వెంటనే ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు లక్ష్మారెడ్డి, మండల రైతుబంధు మాజీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, మాదాసి కుర్వసంఘం మండల అధ్యక్షులు లింగప్ప డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొల్లాపూర్ బహిరంగ సభలో మాదాసి కుర్వలకు ఎస్సీ సర్టిఫికెట్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ రోజు ఊట్కూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మాదాసి కుర్వ సంఘం ఆధ్వర్యంలో త‌హ‌సీల్దార్ చింతా రవికి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాత్రి పగలు తేడా లేకుండా అడవిలో జీవిస్తున్న తమకు ప్రభుత్వం వెంటనే ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మాదాసి కుర్వలు గత కొన్నేళ్లుగా ఎస్సీ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నారాయణపేట జిల్లాలో వెనుకబడిన తమకు అధికారులు వెంటనే స్పందించి ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని, లేని పక్షంలో ఆందోళనలో మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మాదాసి కుర్వలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయకపోతే ఆందోళన ఉధృతం చేసి ప్రభుత్వ కార్యాలయం ముందు గొర్రెలతో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసే వరకు ఆందోళన చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు షేక్ సమీ, కోరంశివారెడ్డి, తరుణ్ రెడ్డి, అమీన్పూర్ గ్రామఅధ్యక్షులు అయ్యలప్ప, కుర్వ సంఘం నాయకులు దేవరింటి నరసప్ప, అయ్యాలప్ప, సిద్ధప్ప వన్నప్ప సిద్ధప్ప నరసప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply