Green Signal | ఏపీ కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

Green Signal | ఏపీ కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

Green Signal | అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మార్పులతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి పెరగనుంది.
క్యాబినెట్ నిర్ణయాల మేరకు:

  • అన్నమయ్య జిల్లాలోని రాయచోటిని మదనపల్లె కొత్త జిల్లా కేంద్రంగా మార్చడం.
  • రాజంపేటను కడప జిల్లాలో కలపడం.
  • రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో చేర్చడం.
  • గూడూరును తిరుపతి నుంచి నెల్లూరు జిల్లాలో కలపడం.
  • కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు.

ఈ పునర్విభజనతో పరిపాలన మరింత సమర్థవంతమవుతుందని, ప్రజలకు సేవలు సమీపంగా అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు, సరిహద్దు మార్పులు త్వరలోనే అధికారిక ఉత్తర్వుల ద్వారా అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

CLICK HERE TO READ కన్నీటి పర్యంతమైన మంత్రి రాంప్రసాద్

CLICK HERE TO READ MORE

Leave a Reply