IND vs NZ | టీమిండియా స్పిన్ మ్యాజిక్.. కివీస్ ఆలౌట్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు జరిగిన ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 44 పరుగుల తేడాతో గెలిచి గ్రూప్ దశలో టాపర్‌గా నిలిచింది.

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 249 పరుగులు చేసింది. దీంతో 250 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. టీమిండియా స్పిన్ మంత్రానికి కుప్పకూలింది.

భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న కేన్ విలియమ్సన్ (81) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. ఓపెనర్ విలా యంగ్ (22), కెప్టెన్ మిచెల్ సాట్నర్ (28) మినహా మరే ఇతర ఆటగాడు 20కి మించి స్కోర్ చేయలేకపోయాడు.

టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి పైపర్‌తో అదరగొట్టాడు. ఇక‌ కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయ‌గా… హర్దక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.

మరోవైపు మార్చి 4న (మంగళవారం) దుబాయ్‌లో జరిగే సెమీఫైనల్ 1లో భారత్ – ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఇక లాహోర్ వేదికగా జ‌రిగే రెండో సెమీఫైనల్.. దక్షిణాఫ్రికా – న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేప‌ట్టిన‌ టీమిండియా.. ఆదిలోనే షాక్ త‌గిలింది. అయితే, 30 ప‌రుగుల‌కు 3 వికెట్లు కోల్పయి క‌ష్టాల్లో ప‌డ్డ రోహిత్ సేన‌.. అనూహ్యంగా పుంజుకుని స్కోర్ బోర్డుపై 249/9 ప‌రుగులు న‌మోదు చేసింది.

ఓపెనర్ గిల్ (2), కెప్టెన్ రోహిత్ శర్మ (15), విరాట్ కోహ్లీ (11) పెవిలియన్ చేరుకోగా…. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్య‌ర్ (98 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ 79) హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగాడు.

అక్షర్ పటేల్ (61 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ 42), కేఎల్ రాహుల్ (29 బంతుల్లో 1 ఫోర్లు, 23) రాణించారు. చివ‌ర్లో ర‌వీంద్ర జ‌డేజా (16) ప‌రుగులు చేసి ఔట‌వ్వ‌గా… హార్ధిక్ పాండ్యా (45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ 45) మెరుపులు మెరిపించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *