MLA | శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

MLA | శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

MLA | డోంగ్లి, ఆంధ్రప్రభ : మదన్ హిప్పర్గ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బచావార్ లక్ష్మణ్ పాటిల్ ను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు(MLA Thota Lakshmi Kantha Rao) మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు జుక్కల్ క్యాంపు కార్యాలయంలో ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు కాంగ్రెస్ నాయకులతో కలసి ఎమ్మెల్యేను కలిసి ఘనంగా గజమాలతో సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోటలక్ష్మీకాంతారావు మాట్లాడుతూ.. ఈ విజయం కార్యకర్తల కష్టానికి నిదర్శనమని, రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే ఉత్సాహంతో పార్టీ క్లీన్ స్వీప్(clean sweep) చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మదన్ హిప్పర్గ నూతన పాలక వర్గం, కాంగ్రెస్ కార్యకర్తలు, సీనియర్ నాయకులు ఉమాకాంత్ పటేల్ ఉన్నారు.

Leave a Reply