Atalji Memory Grove : అసామాన్య నేత Andhra Prabha News

Atalji Memory Grove : అసామాన్య నేత Andhra Prabha News
ఆయనకు అహంకారం తెలీదు
దేశ సార్వభౌమ్యత్వమే లక్ష్యం
అమెరికానూ లెక్క చేయలేదు
ప్రజాస్వామ్య విలువకే ప్రాధాన్యం
ఘనంగా అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి
స్మృతి వనంలో 15 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ
( ఆంధ్రప్రభ, తుళ్లూరు)


గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో అటల్ బిహారీ వాజ్ పేయి (Atal Bihari Vajpayee) జయంతి (Birth anniversary) సందర్భంగా 15 అడుగుల కాంస్య విగ్రహాన్ని (15 Ft Bronze Statue) గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Unveild) ఆవిష్కరించారు.
ఈ ప్రదేశాన్ని అటల్ బిహారీ వాజ్ పేయి స్మృతి వనంగా (Atalaji Memory Grove) తీర్చిదిద్దనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandra Babu) , కేంద్ర వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుపరిపాలన దినోత్సవం పేరుతో బహిరంగ సభ జరిగింది. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రత్యేక పోస్టల్ స్టాంప్ ను ఆవిష్కరించారు.

Atalaji Memory Grove : అమెరికా ఆంక్షల్నీ లెక్కచేయలేదు
కేంద్ర వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Union Minister SivaRaj Singh Chowhan) మాట్లాడుతూ.. అటల్ బిహారీ వాజ్ పేయి అన్ని రంగాల్లో నాకు ప్రేరణ అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. పొక్రాన్ (Pocron Test)అణ్వాయుధ పరీక్షలు చేశారని, అమెరికా ఆంక్షలు (America Sanctions ) విధించినా పట్టించుకోలేదని (Don’t Cared) తెలిపారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు.

గ్రామ వికాసం, స్వర్ణ చతుర్భుజికి పెద్ద పీట వేశారని చెప్పారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదురీదుతానని చెప్పేవారని తెలిపారు. సమృద్ధి భారత్, నరేంద్ర మోడీ – చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వికసిత్ భారత్ కు మార్గదర్శకత్వం వహిస్తున్నారని తెలిపారు. హైదరాబాదును ఐ.టి రాజధానిగా చేసిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ను క్వాంటం వ్యాలీ కి రూపకల్పన చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించుటకు ప్రధాని సహకారం అందిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ ఆనంద ఆంధ్రప్రదేశ్ గా రూపాంతరం చెందాలని ఆకాక్షించారు.
కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ( State Union Minister Srinivas varma) మాట్లాడుతూ సుజల ధార, వంబే కాలనిలు, కిసాన్ క్రెడిట్ కార్డులు వంటి చాలా కార్యక్రమాలు తీసుకువచ్చారన్నారు. రోడ్లు, రహదారులు, విమాన సర్వీసులు అనుసంధానం చేయడంలో చొరవ చూపారని అన్నారు.
Atalji Memory Grove : ఆయనకు అహంకారం తెలీదు

కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి State Union Minister Pemmasani) డా.పెమ్మసాని చంద్ర శేఖర్ మాట్లాడుతూ జాతీయ స్ఫూర్తిని జ్వలింపజేసిన నేత అటల్ బిహారీ వాజ్ పేయి అన్నారు. కార్యదక్షత కలిగిన వ్యక్తి అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో దౌత్య దృక్పథం గొప్పదన్నారు.

అధికారం ఉన్నా అహంకారం (No Pride Leader) లేని నాయకుడు అని పేర్కొన్నారు. దేశంలో ప్రజలు ముఖ్యం, పదవులు కాదని స్పష్టం చేశారు. సమాజంలో ముందుచూపు గల వ్యక్తిగా చంద్రబాబు నాయుడును గుర్తించారని, టెలికం సంస్కరణలలో ముఖ్యమంత్రి సూచనలు స్వీకరించారని తెలిపారు.
Atalji Memory Grove : అటల్జీ అజాత శత్రువు

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ Ap Minister Kandula Durhesh) మాట్లాడుతూ.. వాజ్ పేయి అజాత శత్రువు అన్నారు. అనేక కార్యక్రమాలకు వాజ్ పేయి శ్రీకారం చుట్టారని, ఆ పునాదులపై ప్రస్తుతం గట్టి వ్యవస్థ ఏర్పాటు అవుతుందన్నారు. విలువలుగల రాజకీయాలు చేశారని చెప్పారు. విదేశాంగ శాఖ మంత్రిగా దేశం గొప్పదనాన్ని చాటి చెప్పారని అన్నారు.
Atalji Memory Grove : ఆయన రాజనీతిజ్ఞుడు

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ (Ap Health Minister Satya kumar) మాట్లాడుతూ.. అద్భుత పాలన అందించిన రాజనీతిజ్ఞుడు వాజ్ పేయి అన్నారు. వివిధ రంగాల్లో గొప్ప సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు. రాష్ట్ర బి.జె.పి అధ్యక్షులు పి.వి.ఎన్ మాధవ్ మాట్లాడుతూ.. 15 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ జరిగిందన్నారు. సుపరిపాలన కేంద్రంను అమరావతిలో ఏర్పాటు చేయాలని కోరారు. సంస్కృతికి నిలయంగా దేశం ఉండాలని, చివరి వ్యక్తికి అవకాశాలు అందాలని ఆలోచన చేసిన వ్యక్తి అన్నారు. అటల్ బిహారీ వాజ్ పేయి అందరికీ ఆదర్శప్రాయుడు అన్నారు.

తాడికొండ శాసన సభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో సుపరిపాలనకు ఆద్యుడు అటల్ బిహారీ వాజ్ పేయి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, పార్లమెంట్ సభ్యులు సి.యం.రమేష్, శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, శాసన సభ్యులు నసీర్ అహ్మద్, నరేంద్ర కుమార్, బూర్ల రామాంజనేయులు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు కోటేశ్వర రావు , ఎన్ రమేష్ నాయుడు., కృష్ణయ్య, గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పాల్గొన్నారు
ALSO READ : AC Pallevelugu : ఇక ఏసీ ‘పల్లె వెలుగు’లు Andhra Prabha News
