MLA | కలెక్టరుకు సమస్యలు విన్నవించిన ఎమ్మెల్యే

MLA | కలెక్టరుకు సమస్యలు విన్నవించిన ఎమ్మెల్యే

  • మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం

MLA | జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కలెక్టర్, అవార్డు గ్రహీత కుమార్ దీపక్‌ను నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఈ రోజు మంచిర్యాలలోని క్యాంపు ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే(MLA) కలెక్టర్ తో జన్నారం మండలంలోని పలు సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు.

జన్నారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 200మంది రోగులు డయాల‌సిస్‌(Dialysis) చేసుకునేలాగా ప్రతిపాదనలు పంపాలని, మండలంలోని కిష్టాపూర్ సమీపాన ఉన్న కేజీబీవీ పాఠశాలకు అదనకు నిధులు కేటాయించాలన్నారు. అటవీ సమీప గ్రామాల్లోని ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక సరఫరా, పశువుల మేత, తదితర సమస్యలను, సీసీ రోడ్లకు, డ్రైనేజీలకు నిధులు మంజూరు చేయాలన్నారు.

ఇందిరమ్మ‌ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేసేలాగా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరారు. దీంతో జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఆయన వెంట స్థానిక జెడ్పీటీసీ సభ్యుడు ఎర్ర చంద్రశేఖర్ ఉన్నారు.

Leave a Reply