సౌందర్య లహరి

20. కిరంతీమంగేభ్యః కిరణ నికురంబామృత రసం
హృది త్వామాధత్తే హిమకర శిలామూర్తిమివ యః
స సర్పాణాం దర్పం శమయతిశకుంతాధిప ఇవ
జ్వర ప్లుష్టాన్దృష్ట్వాసుఖయతిసుధాధారసిరయా!

తాత్పర్యం: తన కరచరణాది అవయవాల నుండి అమృతరసాన్ని నిరంతరం వర్షిస్తూ ఉన్న జగజ్జననిని చంద్రకాంతమణిమయమూర్తిగా హృదయంలో ధారణ చేసి ధ్యానించిన సాధకుడు విషసర్పాల దర్పాన్ని గరుత్మంతుడిలాగా ఉపశమింప చేయగలడు. జ్వరతీవ్రత వలన తాపం పొందిన రోగులకు అమృతధారను స్రవించు నాడి వంటి చల్లనిచూపు మాత్రము చేతనే ఆ తాపాన్ని,జ్వరబాధను తొలగించి సుఖాన్ని కలిగించ గలడు కదా!

  • డాక్ట‌ర్ అనంత‌ల‌క్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *