Nizamabad | గొర్రెలకు న‌ట్ట‌ల నివార‌ణ టీకాలు

Nizamabad | గొర్రెలకు న‌ట్ట‌ల నివార‌ణ టీకాలు

Nizamabad | వేల్పూర్, ఆంధ్రప్రభ : వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో ఈ రోజు గొర్రెలు, మేకలకు నట్టల నివారణ(prevention of lice) కార్యక్రమం చేపట్టడం జరిగిందని మండల పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రెడ్డి(Dr. Santosh Reddy) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గొర్రెల కాపరులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా జీవాలకు(beings) నట్టల నివారణ మందులు వేసుకోవాలని సూచించారు.

న‌ట్టల నివారణ చేయడం వలన జీవాలు అధిక బరువుని కలిగి ఉంటాయని త్వరగ ఎదకూ వస్తాయీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుండెం సౌందర్య నవీన్ ఉప సర్పంచ్ స్వామి గౌడ్, పశు వైద్య సిబ్బంది పి సురేష్ జీవిఓ గంగాధర్, ఎల్ఎన్ఎ దయానంద్, జావీద్, గోపాలమిత్ర, పాల్గొన్నారు..

Leave a Reply