World Cup T20 | భార‌త టీమ్ సూప‌ర్‌..

World Cup T20 | భార‌త టీమ్ సూప‌ర్‌..

  • 2026 టీ20 ప్రపంచకప్ భార‌త జ‌ట్టు సెల‌క్ష‌న్ అదుర్స్‌
  • భారత మాజీ కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్

World Cup T20 | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : 2026 టీ20 ప్రపంచకప్ కోసం సెలెక్ట్ చేసిన జ‌ట్టు సూప‌ర్‌గా ఉంద‌ని భారత మాజీ కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్ అన్నారు. జ‌ట్టు అద్భుతంగా ఉంద‌న్నారు. అయితే శుభ‌మ‌న్ గిల్‌ను జ‌ట్టు నుంచి తొల‌గించ‌డంపై ఆయ‌న ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ప్రస్తుత సెలక్షన్ కమిటీ ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంటుందని తాను ఊహించలేదన్నాడు. పొట్టి ఫార్మ‌ట్‌కు వైస్ కెప్టెన్‌గా ఉన్న గిల్‌ను టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి తొల‌గిస్తార‌నుకోలేదు. గిల్ ఫామ్‌లో లేక‌పోవ‌డంతోనే ఈ నిర్ణ‌యం తీసుకొని ఉంటార‌ని అనుకున్నాన‌ని ఆయ‌న తెలిపారు. పొట్టి ఫార్మ‌ట్‌లో ఇటీవ‌ల అత‌ను ఇబ్బంది ప‌డుతున్న విష‌యం వాస్త‌వ‌మేన‌న్నారు. దేశవాళీలో అదరగొట్టిన ఇషాన్ కిష‌న్‌ను ఎంపిక చేయడం మంచి నిర్ణ‌య‌మ‌న్నారు. రింకూ సింగ్‌ను జట్టులోకి తీసుకున్నారు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెనింగ్ చేస్తారు. మొత్తం మీద అద్భుతమైన టీంను ఎంపిక చేశారు.

Leave a Reply