Bichkunda | నిజామాబాద్ జిల్లా

Bichkunda | నిజామాబాద్ జిల్లా
- పాలకవర్గం ప్రమాణ స్వీకారం
Bichkunda | బిచ్కుంద, ఆంధ్రప్రభ : బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను తహసీల్దార్ వేణు ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మొదట సర్పంచ్ గా సంతోష పటేల్, ఉప సర్పంచ్ గా కర్కల పద్మిని బాయ్ గా వార్డు సభ్యులు మద్దెల సాయిలు, జుట్టుల అశోక్, తోట సంతోష్, గులా అబ్బా బోయ్, గౌస్, కుమ్మరి గంగమణి, గంట నవనీత, కొట్టం సాయిలు, నాగం శంకర్, మేస్త్రి లక్ష్మి, గన్న వీరమని లను ప్రమాణస్వీకారం చేయించారు.
అనంతరం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సంతోష్ పటేల్ వార్డు సభ్యులను గ్రామ పెద్దలు అభిమానులు పంచాయతీ సెక్రెటరీ శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ సంతోష్ పటేల్ మాట్లాడుతూ… ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అండ్ గ్రామ పెద్దల, ప్రజల సహకారంతో గెలిపించినందుకు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరి సహకారంతో గ్రామం అభివృద్ధికి తీసుకెళ్తారని ఆయన అన్నారు.
